News

దుబాయ్ వరదలకు కారణం హిందూ దేవాలయమేనని పాకిస్తాన్ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు

267views

ఇండియాపై మరోసారి విషం కక్కే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ కు చెందిన కొంత మంది. దుబాయ్ వరదలకు హిందూదేవాలయమే కారణం అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

రీసెంట్ గా దుబాయ్ ని వరదలు ముంచెత్తాయి. చరిత్రలో ఎన్నడు కనీవినీ ఏరుగని రీతిలో వరదలు వచ్చి.. చాలా నష్టం చేశాయి. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ విచారం వ్యాక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఈ వదలకు.. ఇండియాకు లింకు పెట్టే పని మొదలెట్టారు కొంత మంది పాకిస్థానీయులు. ఈ విషయంలో ఒక వ్యక్తి వివాదాస్పద వ్యాక్యలు చేయడం సంచలనంగా మారింది.

అబుదాబిలో హిందూ దేవాలయమైన BAPS స్వామినారాయణ మందిర్ నిర్మాణానికి.. ఈ వరదలకు లింక్ చేశాడు. ప్రధాని ఫిబ్రవరి 14న అక్కడ ఆలయాన్ని ప్రారంభించారు. గుడి ప్రారంభం తరువాత నెలల వ్యవదిలోనే వరదలు రావడంతో.. ఈ విషయంలో కొత్త వాదనను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వరదలను మతపరమైన ప్రకృతి విధ్వంశంగా సృష్టించే పనిలో ఉన్నారు.

సోషల్ మీడియాలో అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా ఓ పాకిస్థాన్ వ్యక్తి. దుబాయ్ వరదలపై సంచలన కామెంట్స్ చేశాడు. దుబాయ్ ను వదరలు ముంచెత్తడం దైవిక ప్రతీకారంగా అతను అభివర్ణించాడు. దుబాయ్ లో BAPS మందిర్ నిర్మాణం వల్లే ఇలా జరుగుతున్నట్టు ఆరోపించాడు. విగ్రాహారాధుల కోసం ఒక దేవాలయం కట్టడం దీనికి కారణంగా పేర్కొన్నాడు.

“విగ్రహాలు విరగ్గొట్టేవారి దేశంలో విగ్రహారాధన చేసేవారి కోసం దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి.. దుబాయ్ అల్లా యొక్క ఆగ్రహాన్ని గురయ్యాంది. అల్లా ఆగ్రహమే ఇలా వరదలు రూపంలో ప్రజలు ఫేస్ చేసేలా చేసింది అన్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది.


ఇక ఇప్పుడు దుబాయ్ వరదలను.. హిందూ దేవాలయాలకు ముడిపెట్టడంపై సోషల్ మీడియాలో భారత్ లో వ్యతిరేకత వస్తుంది. పాకిస్థాని వ్యక్తి చేసిన కామెంట్స్ ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.