
314views
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. తితిదే ఇప్పటివరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం. దీంతో తితిదే ఫిక్సిడ్ డిపాజిట్లు మొత్తం రూ.18 వేల కోట్లకు చేరాయి. కరోనా తర్వాత నుంచి స్వామి వారికి ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి. 2023-24లో అత్యధికంగా 1,031 కిలోల బంగారం డిపాజిట్ చేయగా మొత్తంగా 11,329 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. వీటిపై ఏటా తితిదేకు రూ.1,200 కోట్ల వడ్డీ ఆదాయం వస్తున్నట్లు సమాచారం.





