News

ఒంటిమిట్టకు 1.20 లక్షల శ్రీవారి లడ్డూలు

358views

కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22వ తేదీ జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్లో శుక్రవారం శ్రీవారి సేవకుల సహకారంతో మినీ (25 గ్రాములు) లడ్డూలు ప్యాక్ చేశారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్, పోటు ఏఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 250 మంది శ్రీవారి సేవకులు 1.20 లక్షల లడ్డూలను 60 వేల ప్యాకెట్లలో ఉంచారు. ఒక్కో ప్యాకెట్లో రెండు లడ్డూల చొప్పున ప్యాక్ చేశారు. సీతారాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.