
భారత్ లో కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో గగనతల రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్)ను ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఎత్తు నుంచి జరిగే గగనతల దాడులను ఈ వ్యవస్థ ఎదు ర్కొంటుంది. భారత్-అమెరికా కలిసి ఈ వ్యవస్థను రూపొందించనున్నాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా స్ట్రైకర్ ఏ1 వాహనాల ఛాసిస్లను భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడే రూపొందిస్తారు. వీటికి గగనతల దాడులను ఎదుర్కొనే లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఎం-షోరాడ్ను అమరుస్తారు. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసు కుంటారు. ఇందులో సంప్రదాయ క్షిపణులను ఎదుర్కొనే వ్యవస్థతో పాటు 50 కిలోవాట్ల శక్తి కలిగిన లేజర్ ఆయుధ వ్యవస్థ కూడా ఉంటుంది. సరిహద్దుల్లో తక్కువ ఎత్తు నుంచి వచ్చే డ్రోన్లు, హెలికాపర్లను, గైడ ర్లను ఎదుర్కోవడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయి. సరిహద్దుల వెంట సంచరిస్తూ ఈ వాహనాలు పాకిస్థాన్, చైనాల నుంచి వచ్చే తక్కువ ఎత్తు గగన తల దాడులను ఎదుర్కొంటాయి. మొత్తం 300 వాహనాలను భారత్-అమెరికాలు నిర్మిస్తాయి. స్ట్రైకర్ ఏ1 వాహనాలను అమెరికా ఎప్పుడో అభివృద్ధి చేసి, వినియోగంలోకి తెచ్చింది. అందులోకి అవసరమైన ఎం-షోరాడ్ను అమెరికా సమకూరుస్తుంది.





