News

నాగ్‌పూర్‌లో ఓటు వేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సర్ సంఘ్‌చాలక్ డా.మోహన్‌ భాగవత్ జీ

225views

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ పరమపూజనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్‌ భాగవత్ గారు పిలుపునిచ్చారు.మొదటి దశ
ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఈరోజు నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటు మన విధి మరియు మన హక్కు అని, కాబట్టి ఈ రోజు నేను చేసిన మొదటి వ్యక్తిగత పని ఓటు వేయడం అని తెలిపారు.ఓటు ద్వారా ఐదేళ్లపాటు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తామని, కాబట్టి దేశ ప్రయోజనాలను ఆలోచించి ఓటు వేయాలని పేర్కొన్నారు.