News

ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల

330views

ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌక లోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. కేరళలోని త్రిశ్శూర్ కు చెందిన ఆమె గురువారం మధ్యాహ్నం కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆమెకు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి స్వాగతం పలికినట్లు పేర్కొంది. మిగిలిన 16 మంది భారతీయ సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నారని, వారిని స్వదేశానికి రప్పిం చేందుకు టెహ్రాన్లోని భారత్ దౌత్య కార్యా లయం ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల 13న ఎంఎస్ సీ ఏరిస్ నౌకను పర్షియన్ గల్ఫ్ లో ఇరాన్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.