News

తిరుమల శ్రీవారి ఆలయంలో సీతారామ ఉత్సవర్లకు స్నప‌న తిరుమంజ‌నం

220views

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు.

అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, ఈవో ఏవి ధర్మా రెడ్డి దంప‌తులు, ఆలయ డిప్యూటీ ఈవో లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.