News

ఉగాదినాడు దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణం

195views

ఉగాది పర్వదినం సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈ నెల 9వ తేదీన దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం బస్సుల్లో ఉచితప్ర యాణం కల్పిస్తున్నామని ఈవో కేఎస్ రామారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మంగళవారం ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి సుప్రభాత సేవ జరుగుతుందన్నారు. అనంతరం అమ్మవారికి ఉపాలయాలలో కొలువై ఉన్న దేవతామూర్తులకు స్నపనాభిషేకం నిర్వహిస్తారని, అనంతరం అలంకారం, అర్చన, నివేదన, హారతి కార్యక్రమాలు అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ రోజున దేవస్థానా నికి చెందిన అన్ని బస్సుల్లోను ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నట్టు పేర్కొ న్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ తూర్పు బుకింగ్ ఆఫీస్ వైపు నాలుగు బస్సులు, పున్న మిఘాట్ నుంచి రెండు బస్సులు, దుర్గాఘాట్ నుంచి రెండు బస్సులు మొత్తం ఎనిమిది సర్వీసులు కొండపైకి తిరుగుతాయని చెప్పారు.

* కొండపైకి ద్విచక్రవాహనాలు, కార్లకు అనుమతి లేదు
భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ద్విచక్ర వాహనాలు, కార్లను అనుమతించడం లేదన్నారు. భక్తులు తమ వాహనాలను విజయ వాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో కానీ, పున్నమిఘాట్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో కానీ పార్కింగ్ చేసుకుని కొండపైకి చేరుకోవాలన్నారు.