ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 58 ; ప్రభాకర్ జీ

286views

“ఎప్పుడూ ఉదయించడమే గానీ,
ఎన్నడూ అస్తమించడం యెరుగని
సర్వోదయ ప్రభాకరుడు జనావళికి సన్మార్గ దర్శకుడు”

అని మహాకవి దాశరథి గారితో కొనియాడబడిన వారు శ్రీ ప్రభాకర్ జీ. ఆయన వాత్సల్యానికి ఎల్లలు లేవు. మానవతే ఆయన మతం. యావద్దేశం ఆయన కార్యక్షేత్రం. ఎక్కడ ఆపద ఉందో, ఎక్కడ దీనజనులు ఆక్రోశిస్తున్నారో, ఎక్కడ ప్రకృతి సంక్షోభాలతో సామాన్య జనం తల్లడిల్లుతున్నారో అక్కడ ప్రభాకర్ ఉండేవారు. ఆయన పాల్గొనని సహాయ కార్యక్రమాలు ఆ రోజుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. ట్టణం నిజానికి ఆయన ప్రవేశించిన తరువాతే, ఆ సహాయకార్యక్రమాలు ఊపందుకునేవి.

ప్రభాకర్ జీ స్వాతంత్ర్య సమర యోధులు. ప్రముఖ సంఘ సేవకులు. గాంధీజీ ప్రియశిష్యులు. ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టి తన అసాధారణ వ్యక్తిత్వము, -ఆనాడే సహన శీలత, కార్య కుశలత, పట్టుదలలతో తన చుట్టూ ఉన్నవారికి అసాధారణ సేవల సందించిన వారు, అణువణువునా ప్రేరణ నింపినవారు.

అనంతపురం జిల్లాలోని పోతురాయి అనే కుగ్రామంలో 1920లో ఒక నిరుపేద పారిజన కుటుంబంలో చిదంబరయ్య, సుబ్బమ్మ దంపతుల ఏకైక పుత్రుడు ప్రభాకర్. అతని తల్లిదండ్రులు క్రైస్తవ మతం స్వీకరించిన కారణంగా ఆ బాలునికి ‘జోసెఫ్’ అనే పేరు పెట్టారు. బాల్యంలోనే తండ్రి చనిపోవటంతో జోసెఫ్ తల్లి సుబ్బమ్మ గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయాగా పనిలో చేరింది. గుత్తి అందన్ మిషన్ పాఠశాలలో జోసెఫ్ 7వ తరగతి చదువుతుండగా తల్లికి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి బదిలీ అయింది. అనంతపురంలో మున్సిపల్ పాఠశాలలో చేరి ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేశాడు జోసెఫ్. విద్యార్థి దశలోనే తెలివైనవాడయినా చదువుపై శ్రద్ధ చూపక జన విద్య జపాటల్లో మంచి ప్రావీణ్యం సాధించాడు. ఫుట్బాల్, హాకీ, బ్యాడ్మింటన్ ఆటలలో 963 జూన్ స్థాయిలో బహుమతులు పొందాడు.

అనంతపురంలో SSLC పూర్తయ్యాక జోసెఫ్ అనంతపురం నుంచి కాలినడకన బందరు చేరాడు. జాతీయ కళాశాలలో చేరిన తరువాత అక్కడి వాతావరణం,విద్యావిధానం, క్రమశిక్షణ జోసెఫ్ లో గొప్ప మార్పును కలిగించింది. కళాశాల ప్రిన్సిపాల్ అడివి బాపిరాజు గారి శిష్యరికం లభించింది. జోసెఫ్ పాఠశాలలో ఉండగానే తన మిత్రులు మరో ఇద్దరి పేర్లను తన పేరుతో కలిపి పుస్తకాలపై ‘జోసెఫ్ మోహన్ ప్రభాకరం’ అని వ్రాసుకునేవాడు. అడవి బాపిరాజు గారు విద్యార్థులను, అధ్యాపకులను సమావేశపరచి జోసెఫ్ అనే పేరును ప్రభాకర్ గా మార్చారు. కాలేజి రిజిస్టర్లో కూడా ఆ మేరకు మార్పు చేశారు.

ప్రభాకర్ సత్ప్రవర్తనుడై మంచి విద్యార్ధిగా అందరి మన్ననలనూ పొందగలిగారు. కళాశాలలో అడివి బాపిరాజు, కాటూరి వెంకటేశ్వరరావు మొదలైన జాతీయ నాయకులు, ఆచార్యుల ప్రసంగాలు, ఎంతో ఉత్తేజకరంగా వుండేవి. గాంధీజీ సిద్ధాంతాలపట్ల ఆకర్షితుడై ఆయన రచనలను బాగా అధ్యయనం చేశారు ప్రభాకర్, జాతీయ కళాశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాషలతోపాటు చిత్రలేఖనం, ఖాదీ పనులు, నేతపని మొదలయినవి నేర్చేవారు. సాంఘిక కార్యక్రమాలు – హరిజనవాడలకు వెళ్లడం వారికి పారిశుద్ధ్యం గూర్చి చెప్పడం సహపంక్తి భోజనా ప్రతిదేవి కళాశాలలో గల రెండు వందలమంది విద్యార్థులలో ప్రభాకర్ తల ప్రతిభా పాటవాల ద్వారా ఆచార్యుల అభిమానం పొందారు.

ఆంధ్రదేశంలో మొదటి బేసిక్ విద్యా శిక్షణ కేంద్రం జాతీయ కళాశాలలోనే ప్రారంభించారు. ప్రభాకర్ ను బేసిక్ శిక్షణ విభాగానికి పంపారు. సేవాగ్రాంలో కేంద్రీయ బేసిక్ విద్యా సంఘం అధ్యక్షుడు శ్రీ ఆర్యనాయకం, కార్యదర్శి శ్రీమతి ఆశాదేవి బందరు వచ్చి బేసిక్ శిక్షణ కేంద్రం దర్శించారు. అక్కడ చురుకైన విద్యార్థిగా ఉన్న ప్రభాకర్జీని సేవాగ్రాం తీసుకెళ్లారు. అప్పటికే గాంధీజీ రచనలు, వారి ఆశయాలతో ఆకర్షితుడైయున్న ప్రభాకర్తో, గాంధీజీని చూడాలనే ఆకాంక్షతో నేరుగా పాల్గొన్నా గాంధీ ఆశ్రమానికి చేరుకున్నారు. తన విశుద్ధ వ్యక్తిత్వము, నిర్మల వర్తనతో సభాకర్ సేవాగ్రామ్లోని గాంధీ ఆశ్రమంలో చోటు సంపాదించ గలిగారు. కస్తూర్బా, చేసుకుని మహాత్మాగాంధీలను మాతాపితలుగా భావించి మనసారా వారిని సేవించుకున్న ధన్యజీవి ప్రభాకర్. సేవాగ్రామ్ ఆశ్రమంలో అందరికీ తలలో నాలుకలా మెలగేవారు. అయినవారే అసహ్యించుకుని ఇంటినుంచి తరిమివేసిన కుష్టు రోగులను చేరదీసి, వారి పుండ్లను కడిగి మందులు రాసి సేవలు చేసిన పుణ్య పురుషుడాయన. మనసా వాచా కర్మణా గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించడమే కాక, వస్త్రధారణలో సైతంగాంధీజీని అనుకరించి, ఎక్కడ ఉన్నా ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, నిద్రించే ముందు వార్ధాలోని సేవాగ్రాంలో తాను నిద్రించే ప్రదేశంలోనే పడుకుంటున్నట్లు మానసికంగా సంకల్పించుకుంటూ పడుకున్న యోగి పుంగవుడు ప్రభాకర్..

గాంధీ గారి నుంచి ప్రకృతి చికిత్సా రహస్యాలను పుణికి పుచ్చుకుని, జీవితాంతం తాను ఆ పద్ధతిని పాటించడమే కాకుండా హైదరాబాద్లో అమీర్ పేట, శివరాంపల్లి మొదలైన ప్రదేశాలలో ప్రకృతి చికిత్సాలయాలను ఏర్పాటు చేశారు ప్రభాకర్. అవి ప్రకృతి చికిత్సాభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. గాంధీ ఆశ్రమంలో ఉన్నంత కాలం ఆశ్రమంలో గాంధీజీ సపర్యలతోపాటు రోగులకు సేవలు, తోటపని, ఉదయం, సాయంకాలం ప్రార్ధన నిర్వహించడమే కాదు, ఆశ్రమంలోని అన్ని పనులను ప్రభాకర్ జీయే చూసుకునేవారు. మధురమైన కంఠం ప్రభాకర్‌జీది. అన్ని మతాల ప్రార్ధనలను, గీతాలను, భజన పాటలను శ్రావ్యంగా పాడేవారు. రెండవ ప్రపంచయుద్ధ వ్యతిరేక ఉద్యమంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల ప్రభాకర్ కారాగార శిక్షను అనుభవించారు. 1943లో ఆగస్టులో రాయవేలూరు జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. గాంధీజీ ఆశ్రమంలో ప్రభాకర్ మొత్తం 12 సంవత్సరాలు ఉన్నాడు. కొంతకాలం ఆశ్రమ కార్యదర్శిగా కూడా వ్యవహరించాడు. అఖిలభారత ప్రకృతి చికిత్సా సంఘానికి ఉపాధ్యక్షుడుగా, అఖిలభారత మద్యపాన నిషేధ సంఘంలో కార్యవర్గ సభ్యుడుగాను పనిచేశాడు.

మహాత్ముని అస్తమయం పిమ్మట ప్రభాకర్ వినోబాభావే అంతేవాసి అయినారు. సేవలకు పంచడానికి భూస్వాములు భూమిని దానం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ “వినోబాభావే దేశమంతటా నిర్వహించిన భూదానోద్యమంలో ప్రభాకర్ జీ చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలికి తొలి అధ్యక్షులుగా వినోబాభావే ప్రభాకర్‌జీని నియమించారు. ప్రస్తుత తెలంగాణాలోని శివరాంపల్లిని కేంద్రంగా చేసుకుని ప్రభాకర్ జీ తన ఉద్యమాన్ని విస్తరించారు. 1977లో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన దివిసీమ ఉప్పెన అనంతరం జరిగిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ప్రముఖపాత్ర వహించారు. ఆ సమయంలో ఎన్నో విధాల సేవలందిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తల సేవారతిని గమనించి రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ (RSS) అనే నూతన నిర్వచనాన్ని ఇచ్చింది ప్రభాకర్ జీ యే.