
174views
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భారీ హిమపాతం కారణంగా సుమారు 80 మంది ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. 17,688 అడుగుల ఎత్తులో ఉన్న చాంగ్‌లా పాస్‌లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన సైనికులు రెండు గంటలు శ్రమించి వారిని కాపాడారు. మహిళలు, చిన్నారులతో సహా మంచులో చిక్కుకుపోయిన 80 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.





