News

ఆలయంలో ‘రీల్స్‌’ వద్దన్నందుకు సెక్యూరిటీ గార్డులపై దాడి

179views

మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత ప్రాంతంలో వీడియోలు షూట్‌ చేస్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. పాలక్‌, పారి అనే ఇద్దరు మహిళలు ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియో రీల్స్‌ చేస్తుండగా.. మహిళా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో వారిపై ఆ ఇద్దరు మహిళలతో పాటు అక్కడ ఉన్న మరికొందరు దాడికి పాల్పడ్డారు. మహిళా గార్డులుగా పనిచేస్తున్న వారిని శివానీ పుష్పాడ్‌, సంధ్య ప్రజాపతి, సంగీత చంగేసియాగా గుర్తించారు. వీరిపై అనుచితంగా దాడి చేసిన నిందితులు నాగ్దా పట్టణానికి చెందినవారిగా గుర్తించి.. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.