
404views
భారత్ లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొ న్నారు. పీవోకే ప్రజలు భారత్ లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. ‘కాశ్మీర్ ను వాళ్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా? పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి వాళ్లు ఆందోళన చెందాలి. అక్కడ దాడి చేసి ఆక్రమించుకునే అవసరం మనకు ఉండదని ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. భారత్ లో విలీనం కావాలని పీవోకే ప్రజలే స్వయంగా డిమాండు చేస్తున్నారు’ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



