News

అన్నవరం దేవస్థాన బడ్జెట్‌ రూ.176.90 కోట్లు

275views

అన్నవరం దేవస్థానం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌ రూ.176.90 కోట్లకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఆమోదం తెలిపారు. బడ్జెట్‌ అమలులో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. రూ.177.25 కోట్లు ఆదాయం, రూ.177.14 కోట్ల వ్యయం అంచనాలతో ఈ బడ్జెట్‌ను ఇటీవల ధర్మకర్తల మండలి చర్చించి ఆమోదానికి ప్రతిపాదనలు పంపడం విదితమే.

వ్యయం ఇలా:

  • ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు రూ.41.30 కోట్లు, ప్రసాదం తయారీ, వ్రతాలు, నిత్య కల్యాణం, ఇతర ఆర్జిత సేవలకు పూజా సామగ్రి కొనుగోలుకు రూ. 34.52 కోట్లు, ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు రూ.1.65 కోట్లు, ప్రసాదం ప్యాకింగ్‌, నాయీ బ్రాహ్మణులకు, ఇతరులు తదితర పారితోషికాలకు రూ. 21.05 కోట్లు, పారిశుద్ధం, భక్తులకు సౌకర్యాలకు రూ.6.70 కోట్లు, ధర్మప్రచారానికి రూ.51 లక్షలు, విద్యుత్తు నిర్వహణ, నీటి సరఫరా సదుపాయాలకు రూ.2.55 కోట్లు, రవాణా నిర్వహణకు రూ.1.50 కోట్లు, దత్తత దేవాలయాలు, విద్యా సంస్థలు, వైద్యసేవలు, వేదపాఠశాల నిర్వహణకు రూ. 5.25 కోట్లు ఆమోదించారు.
  • ఎస్పీఎఫ్‌, హోంగార్డులు, భద్రతా సిబ్బందికి రూ.4.75 కోట్లు, ఈపీఎఫ్‌, ఆడిట్‌ఫీజు, సీజీఎఫ్‌, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌, పన్నులకు రూ.19.56 కోట్లు, పలు అభివృద్ధి పనులకు రూ.14.50 కోట్లు, విద్యుత్తు సామగ్రి, ఫర్నిచర్‌, కొత్త వాహనాల కోనుగోలుకు రూ.1.20 కోట్లు కేటాయించారు.
  • నిత్యాన్నదానం ట్రస్ట్‌కు సరకులు, కూరగాయలు, పాలు, గ్యాస్‌, సిబ్బందికి జీతాలు తదితరాలకు రూ.6.29 కోట్లు, గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.58 లక్షలు కేటాయించారు.
  • ఆదాయం అంచనా ఇలా..

  • లీజుల ద్వారా రూ. 19.16 కోట్లు, వసతి ద్వారా రూ. 10.16 కోట్లు, హుండీల ద్వారా రూ. 22.05 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 40 కోట్లు, వ్రతాలు, నిత్యపూజల ద్వారా రూ. 56.75 కోట్లు విరాళాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుపై వడ్డీ, గోల్డ్‌బాండ్స్‌, ద్వారా రూ. 5.46 కోట్లు, క్యాపిటల్‌ డోనేషన్లు రూ. 1.17 కోట్లు, అన్నదానం, గోసంరక్ష ట్రస్ట్‌ తదితర వాటి ద్వారా రూ. 18 కోట్లు ఆదాయం వస్తుందని అంచనాతో బడ్జెట్‌ రూపొందించారు.