News

సగానికి తగ్గిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు

285views

దేశంలో వామపక్ష తీవ్రవాదం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 10 రాష్ట్రాల్లో ప్రస్తుతం 38 జిల్లాల్లోనే తీవ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయి. 2015లో ఈ జిల్లాల సంఖ్య 75గా ఉండేది. గడచిన తొమ్మిదేళ్లలో ఈ మార్పు చోటుచేసుకుందని కేంద్ర హోంశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. తాజా అంచనాలతో 1. ఆంధ్రప్రదేశ్‌(1), 2. బిహార్‌, 3. ఛత్తీస్‌గఢ్‌(15), 4. ఝార్ఖండ్‌(5), 5. కేరళ(2), 6. మధ్యప్రదేశ్‌(3), 7. మహారాష్ట్ర(2), 8. ఒడిశా(7), 9. తెలంగాణ(2), 10. పశ్చిమబెంగాల్‌(1)లలోని తీవ్రవాద ప్రభావిత జిల్లాల వర్గీకరణ జాబితాను కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల డీజీపీలకు అందించింది. ఈ మేరకు వామపక్ష తీవ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి 2015లో ఆమోదించిన జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సాయుధ బలగాల మోహరింపు ఉంటుంది.