News

కనులపండువగా.. శ్రీవారి తెప్పోత్సవాలు

385views

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు తిరుమలలో బుధవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో సంధ్యాసమయాన రామావతారంలో తెప్పపై స్వామివారు ఆనంద విహారం చేశారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో దర్శనమిచ్చారు. రెండోరోజు గురువారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి అవతారంలో శ్రీవారు దర్శనమిస్తారు.