
296views
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి వేడుకగా అంకురార్పణ చేశారు. అనంతరం విష్వక్సేనుడికి ఉత్సవం నిర్వహించారు. ఉభయకర్తగా ఆనం గోపాలకృష్ణారెడ్డి వ్యవహరించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ శ్రీనివాసులు, ఈవో వెంకటేశ్వర్లు, మండలి సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో గురువారం తెల్లవారుజామున ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు శేషవాహన సేవ జరగనుంది.





