Newsvideos

సమాజ మార్పునకు సంఘ్ అవసరమైన చొరవ తీసుకుంటుంది

463views

సమాజంలో వివిధ రూపాల్లో ఉన్న చెడును తొలిగించాలి. సమృద్ధవంతమైన, సమర్థవంతమైన, స్వాభిమాన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్‌లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .సమాజంలోని అన్ని మంచి కార్యాలకు సహకరించే విధంగా స్వయంసేవకులకు శిక్షణ ఇస్తామన్నారు.పరివర్తన దృష్టి కోణంలో కుటుంబ జీవన మూల్యాలు, పర్యావరణ రక్షణ, సామాజిక సమరసత..అన్ని విభేదాలను వదిలించుకొని మనమంతా ఒక జాతి వారమనే భావనను తీసుకురావాలని పేర్కొన్నారు. సమాజం, సంఘ రెండు వేర్వేరు కాదు. ఇదే మా స్వప్నం. ఇదే మా ఆలోచన. ఎందుకంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సమాజంలోని సంస్థ కాదు యావత్ సమాజాన్ని నడిపించే సంస్థ అని తెలిపారు.