
మథుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు కమిటీ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులో మాత్రమే ఉంచాలని పేర్కొంది. 18 కేసుల్లో 15ని కలిపి విచారించాలని అభ్యర్థించినందున ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయస్థానం తెలిపింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి స్పష్టం చేసింది. వివాదానికి సంబంధించిన 15 కేసులను కలిపి విచారించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని మసీదు కమిటీ వ్యతిరేకించింది. వీటిని మథుర జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు బదిలీ చేయడాన్ని మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్ ఏప్రిల్‌లో విచారణకు రానుంది.
అలహాబాద్ హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా షాహీ ఈద్గా మసీదును సుప్రీంకోర్టు కోరిందని హిందూ తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ అన్నారు. శ్రీకృష్ణుడి జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతంలో షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన 15 కేసులను కలిపి హైకోర్టు విచారణ చేపట్టిందని చెప్పారు. రీకాల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు రావాలని మసీదు కమిటీకి శంకర్ జైన్ సూచించారు.
#WATCH | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side says "Supreme Court asked Shahi Idgah Masjid to present its case in Allahabad High Court. Allahabad High Court had consolidated 15 cases suits concerning the Krishna Janmabhoomi-Shahi Idgah Masjid dispute to hear… pic.twitter.com/gO7BOU9zSF
— ANI (@ANI) March 19, 2024
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమిపై షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హిందూ పక్షం పేర్కొంది. ఈ స్థలాన్ని 2022లో శ్రీకృష్ణ జన్మస్థలంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.





