News

అయోధ్యకు సైకిల్‌పై పయనం

277views

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధికారుల సూచన మేరకు సైకిల్‌పై ప్రయాణం చేస్తూ తక్కువ సమయంలో అయోధ్యకు చేరుకుని రికార్డు నెలకొల్పుతానని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం కొల్లివానిపాలేనికి చెందిన పీలా మణీంద్ర తెలిపాడు. సోమవారం అచ్యుతాపురం నుంచి సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టాడు. 1,700 కిలోమీటర్ల దూరాన్ని పదిరోజుల్లోగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గతంలో అయ్యప్ప ఆలయం, కోల్‌కతా, విజయవాడ, తిరుపతి, చెన్నై వంటి పట్టణాలకు సైకిల్‌యాత్ర చేశారు. యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వసతి, భోజన సదుపాయం కల్పిస్తోందన్నారు. యాత్రను గ్రామపెద్దలు కూండ్రపు వెంకునాయుడు, కోన బుజ్జి, భీముని నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.