News

తొలి చిత్రాలను పంపిన ఇన్‌శాట్‌-3డీఎస్‌

381views

ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌.. భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ సాధనాలను అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ) అభివృద్ధి చేసింది. ఈ చిత్రాలను కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ ప్రాసెస్‌ చేసింది. 6-ఛానల్‌ ఇమేజర్‌.. భూ ఉపరితలాన్ని, వాతావరణాన్ని బహుళ తరంగదైర్ఘ్యాల్లో చిత్రీకరించగలదు. దాని సాయంతో మేఘాలు, గాల్లోని ఏరోసాల్‌ రేణువులు, భూ ఉపరితల ఉష్ణోగ్రత, పచ్చదనం, నీటి ఆవిరి తీరు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. 19-ఛానల్‌ సౌండర్‌ సాయంతో.. భూ వాతావరణం నుంచి వెలువడే రేడియోధార్మికతను పరిశీలించొచ్చు.