
273views
పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ ఖైబర్ ప్రావిన్స్‌లోని అబొటాబాద్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. యునైటెడ్ జిహాద్ కౌన్సిల్‌కు అతడు స్వయం ప్రకటిత ప్రధాన కార్యదర్శి. పాక్‌లోని ఉగ్ర గ్రూప్‌లను ఇది సమన్వయం చేసుకొని కశ్మీర్‌లో దాడులు నిర్వహిస్తుంది. 1990ల్లో ప్రారంభించిన తెహ్రీక్ ఉల్ ముజాహిద్దీన్ అనే సంస్థకూ షేక్ జమీల్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2019లో దీనిపై కేంద్రం నిషేధం విధించింది. 2022లో భారత హోంశాఖ జమీల్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడి స్వస్థలం కశ్మీర్‌లోని పుల్వామా. కొన్నేళ్ల క్రితం సరిహద్దులు దాటి పాక్‌కు పారిపోయాడు. ఇటీవలే ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా మృతి చెందిన విషయం తెలిసిందే.





