
288views
భారత నౌకాదళానికి చెందిన అధికారిణుల సముద్ర సాహసయాత్ర ఫిబ్రవరి 28న గోవాలో ప్రారంభమైందని నేవీ వర్గాలు తెలిపాయి. ఇండియన్ నేవీ సెయిలింగ్ వెసల్ ‘ఐఎన్‌ఎస్‌వీ తరిణి’పై లెఫ్ట్‌నెంట్ కమాండర్ కె.దిల్‌నా, లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఎ.రూప చేపట్టిన యాత్రకు విశ్రాంత కమాండర్, యాట్చ్‌మెన్ అభిలాష్ టామీ జెండా ఊపారు. భారత మారిటైం కార్యకలాపాల్లో లింగవివక్షకు తావులేకుండా… జాతీయ సమానత్వం పెంపొందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నట్టు వెల్లడించాయి. గోవాలో ప్రారంభమైన యాత్ర మారిషస్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నాయి.





