ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 30 ; వావిలాల గోపాలకృష్ణయ్య

449views

సమాజశ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం పరితపించిన సేవాతత్పరులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య. నిరాడంబరమైన ఖద్దరు పంచి, భుజంపైన కండువా, చేతిలో పంట ఖద్దరు సంచితో సంచరించే గొప్ప మానవతావాది. పేదల సంక్షేమాన్ని త్రికరణ శుద్ధితో కాంక్షించి నిరుపేద బాంధవుడు వావిలాల. ఆయన విద్యాభ్యాసం ప్రాథమిక విద్యతో ఆగినా, అవిరళకృషితో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో అపారమైన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాడు. అమేయమైన పట్టుదలతో నిరంతర అధ్యయనంతో నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం అన్న ప్రశంస లందుకున్నారు. తెలుగులో ప్రజోపయోగకరమైన 30 గ్రంథాలు, ఇంగ్లీషులో 13 గ్రంథాలు రచించారు.

వావిలాల వారు సెప్టెంబరు 17, 1906లో విజయదశమి నాడు సత్తెనపల్లిలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, వావిలాల వారు బాల్యంలో సత్తెనపల్లి ప్రాథమిక పాఠశాలలో చేరారు. వారి కుటుంబం మధ్యలో ఆయన మేనమామతో కలిసి మార్కాపురం వెళ్ళినందున ప్రాథమిక విద్యకు అంతరాయం కలిగింది. తిరిగి వచ్చిన తర్వాత ఆయన గతంలో చదివిన అమెరికన్ లూథరన్ పాఠశాలలో నాల్గవ తరగతిలో చేరాడు. అక్కడ ‘అద్దంకి యజ్ఞనారాయణ’ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలతోపాటు తరగతి గదిలో ప్రముఖ భారతీయవీరులైన శివాజీ, రాణాప్రతాప్ సింగ్ వంటి వారి వీరోచిత సాహసగాథలను వివరించేవాడు. ప్రముఖ జాతీయోద్యమ నాయకుడైన బాల గంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ వంటి వారి ప్రసంగాల విశేషాలను ప్రబోధించేవాడు. స్వామి వివేకానంద తాత్విక భావాలను గూర్చి చెప్పేవాడు. ప్రముఖ జాతీయోద్యమ నాయకుల త్యాగాలు, వ్యక్తిత్వ విశేషాలచేత ప్రభావితుడైన వావిలాల వారు జాతీయోద్యమంపట్ల ఆసక్తిని, దేశభక్తి తత్పరతను పెంచుకున్నాడు. ఆయన చదివే పాఠశాలలో ఆదివారం జరిగే బైబిలు క్లాసుకు హాజరుకాని వారికి సోమవారం హాజరైనా హాజరు వేసేవారు కాదు. అందువల్ల విద్యార్ధులు విధిగా ఆదివారం బైబిలు క్లాసుకు వెళ్ళవలసివచ్చేది. మిషన్ పాఠశాల అధికార్ల వైఖరి పట్ల విద్యార్థుల్లో విముఖత ఏర్పాటైంది. వావిలాల వారు మిషన్ పాఠశాల పట్ల విరక్తి కలిగి ఐదో తరగతి చిలకలూరిపేటలో మతమహుల ఇంట్లో ఉండి చదివారు.

బ్రిటీష్ ప్రభుత్వం విభజించి పాలించే సిద్ధాంతంతో బెంగాలు రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. దానికి నిరసనగా వందేమాతరం ఉద్యమం ఊపందుకొంది. బిపిన్ చంద్రపాల్ దక్షిణ భారతదేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యపట్టణాలలో చేసిన ప్రసంగాలు ఆంధ్రుల్లో జాతీయోద్యమ భావాలను రేకెత్తించాయి. మింటో మార్లే సంస్కరణలు, జలియన్ వాలా బాగ్ దారుణ సంఘటనలు (1919) దేశభక్త తత్వరులకు ప్రభుత్వం బాధాకరంగా పరిణమించాయి. జాతీయోద్యమ తీవ్రతను పెంచాయి.

పాఠశాలల ద్వారా او

ఆంధ్రప్రదేశ్ లో దామరాజు పుండరీకాక్షుడు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు, చెరుకువాడ నరసింహం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి ప్రముఖ జాతీయోద్యమనాయకులు సత్తెనపల్లిలో చేసిన ప్రసంగాలు బ్రిటీషువారి దురాగతాలను, అన్యాయాలను జనసామాన్యంలో స్వాతంత్ర్య సాధనా పోరాట ఆవశ్యకతను రేకెత్తించాయి. అప్పటి బ్రిటీషు వారి దుర్మార్గాలు సాంప్రదాయ సిద్ధమైన వావిలాల వారి కుటుంబీకులను చలింపచేసాయి. అప్పట్లో కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఆంధ్రపత్రికలో ఎప్పటికప్పుడు స్వాతంత్య్ర పోరాట సంఘటనలు ప్రచురించేవారు. ఆ పత్రిక పోస్టుద్వారా సాయంత్రం 5 గం॥లకు వచ్చేది. వావిలాల వారు ఆంధ్రపత్రికను క్షుణ్ణంగా చదివి ప్రజలకు వార్తలను వివరించేవారు. బ్రిటీషువారు కుటిలనీతితో వార్తాపత్రికలను నిషేధించే ప్రయత్నం చేసారు. ప్రజల స్పందన వల్ల పత్రికానిషేధాన్ని తొలగించారు. ప్రజలు దారిద్ర్యంతో ఆకలిబాధలతో అలమటించే స్థితిని చూసి వావిలాల వారు చలించిపోయారు. తాను అభిమానించే ప్రజ, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరివర్తన కోసం పూనుకున్నారు. ఆ సందర్భంలో పెళ్ళి ప్రస్తావన వచ్చింది. 40 ఎకరాల వ్యవసాయ భూమిని కట్నంగా ఇస్తామన్నా ఆయన తిరస్కరించాడు. తాను స్వాతంత్ర్య పోరాటంలో జైలుకి వెళ్ళి వేరొకరిని భాద పెట్టలేనని చెప్పి పెళ్ళిని కాదని జీవితాంతం బ్రహ్మచర్యాన్ని గడిపాడు. వావిలాల వారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో కలిసి గ్రంథాలయ, వయోజన విద్యా కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించారు. సారా వ్యతిరేకోద్యమంలో అలుపెరగని పోరాటం చేసి గాంధీజీ మన్ననలను పొందారు. రాత్రి పాఠశాలల ద్వారా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటుచేసిన అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. పాలనా భాషగా, బోధనా భాషగా తెలుగు అమలకు అవిరళ కృషి చేసారు. ఆంగ్లభాషా వ్యామోహాన్ని నిరసించారు. ‘మమ్మీ’ ‘ అంటే ‘శవమని’ ‘పాలిచ్చే పక్షి’ అనే అర్థాలు తెలియక తల్లులంతా మమ్మీలని * పిలిపించుకుంటున్నారని అధిక్షేపించారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం, వంశధార వంటి ప్రాజెక్టుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రణాళికా సంఘాలతో రాయబారం నడిపి వాటి సాధనకు కృషిచేశారు. వావిలాల వారు 2003 ఏప్రియల్ 27వ తేదీన అనారోగ్యంతో మరణించారు