News

పాక్ లో బహుభార్యత్వం ఉంటే ఇక్కడా ఉండాలి : సనా మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

5views

మహారాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై జరిగిన చర్చ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. బహుభార్యత్వాన్ని కేవలం ముస్లింలకే పరిమితం చేయడం సరికాదని, అన్ని మతాల్లోనూ అలాంటి ఆచారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

సభలో మాట్లాడిన సనా మాలిక్, “బహుభార్యత్వం ఇస్లాంలో ఉంది. ముస్లిం వ్యక్తిగత చట్టం దీనికి అనుమతిస్తుంది. ఖురాన్‌లో కూడా దీని ప్రస్తావన ఉంది” అని అన్నారు. అలాగే, “ఖురాన్‌లో ఏదైనా ప్రస్తావిస్తే.. అది పాకిస్థాన్‌లో అమలు చేస్తే ఇక్కడ కూడా చేయాలి” అన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముస్లిం మహిళలే మాత్రమే వేధింపులకు గురవుతున్నారని భావించడం సరికాదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు షైనా ఎన్‌సీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలకు గౌరవప్రదమైన జీవితం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని, అలాంటి సమయంలో బహుభార్యత్వాన్ని సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.