NewsSeva

ఆర్ఎస్ఎస్ సహకారంతో ఆర్థిక వికాసం దిశగా గుమ్మయ్యగారి పల్లి గ్రామం

314views

గ్రామ వికాసం కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కృషి చేస్తోంది. ఒక గ్రామం మొత్తం ఐకమత్యంతో ఒక కుటుంబంగా మెలగడానికి అవసరమైన సమరసత, కుటుంబ సంరక్షణ, పర్యావరణ రక్షణ, గోసేవ, విలువలతో కూడిన సమాజం, పరమత సహనం, దేశం కోసం సమాజం కోసం తపించే బలమైన భావన, మనమూ మన చుట్టూ ఉన్న సమాజమూ బాగుండాలి అన్న వసుదైక తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గ్రామాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో భాగంగా, శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారి పల్లి గ్రామంలో పొదుపు పై అవగాహన కల్పించడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తున్న గ్రామస్థులు గత రెండు సంవత్సరాలుగా డబ్బును పొదుపు చేస్తున్నారు. గ్రామానికి చెందిన 45 మంది మహిళలు, 15 మంది పురుషులు వేర్వేరుగా పొదుపు సంఘంగా ఏర్పడి నెలకు రూ.200 జమ చేస్తున్నారు.