
బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీలపై ఉన్న కేసులో మరో 9 నెలలలో తుది తీర్పు వెలువరించాల్సిందిగా జస్టిస్ పాలీ నారీమన్ అధ్యక్షతన గల సుప్రీం కోర్టు బెంచి ప్రత్యెక న్యాయస్థానాన్ని ఆదేశించింది.

ఈ కేసులో గణనీయమైన పురోగతి ఉన్నదని సుప్రీమ్ కోర్టు బెంచి భావిస్తున్నది. నిజానికి బాబ్రీ మశీదు కూల్చివేత కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి ఈ ఏడాది సెప్టెంబరు 30న పదవీ విరమణ చేయనున్నారు. కేసు ముగింపు దశలో ఉన్నందున కేసు పూర్తయ్యే వరకు న్యాయమూర్తి పదవీ కాలం పొడిగించవలసి ఉన్నది.

కావున తదనుగుణంగా 6 నెలలలో కేసు విచారణను ముగించి తదుపరి 3 నెలలలో తీర్పును వెలువరించవలసిందిగా ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీమ్ బెంచి ఆదేశించింది. న్యాయమూర్తి పదవీ విరమణ కాలం పొడిగించుటకు అవసరమైన అనుమతులకై అలహాబాద్ హైకోర్టును కోరవలసినదిగా ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీమ్ బెంచి సూచించింది.





