News

భారత్ అక్రమ వలసదారుల రాజధాని కాకూడదంటే ఎన్నార్సీ పూర్తికి మరింత గడువు కావాలి – సుప్రీమ్ ను కోరిన కేంద్రం.

645views

జాతీయ పౌర నమోదు పట్టిక (ఎన్ ఆర్ సీ) తుది నివేదిక జూలై31లోగా  సమర్పించవలసి ఉండగా  దానికి మరింత సమయాన్ని ఇవ్వవలసినదిగా 19/7/2019 శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం  సుప్రీం కోర్టును కోరింది. కొన్ని లక్షల మంది పేర్లను జాతీయ పౌర నమోదు పట్టికలో తప్పుగా చేర్చి ఉన్న కారణంగా దాని సవరణకు మరికొంత సమయాన్ని ఇవ్వవలసినదిగా  కేంద్ర ప్రభుత్వం సుప్రీంను అభ్యర్ధించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సీనియర్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ “అక్రమ వలసదారులు గుర్తించబడాలి. కానీ ఆ ప్రక్రియ పూర్తి జాగ్రత్తతో చెయ్యవలసివుంది. బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. భారత్ వలసదారుల రాజధాని కారాదు.” అని పేర్కొన్నారు. కనుక తుది జాబితాను రూపొందించటానికి సుదీర్ఘ సమయం పడుతున్నందున అందుకు కేటాయించిన సమయం సరిపోదని కేంద్రం పేర్కొంది.

బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామాల్లో 20%, మిగతా అస్సామంతా కనీసం 10% జాబితాను పునః పరిశీలించవలసి ఉన్నదని కేంద్రం సుప్రీంకు తెలిపింది. స్థానికుల ప్రభావాలకు, ఒత్తిళ్లకు అతీతంగా ఈ పరిశీలన జరగాల్సి ఉందని, కనుక ఆయా ప్రాంతాలకు కొంత దూరంగా ప్రక్రియ జరగాల్సి ఉన్నదని తెలిపింది. ఇలాంటి నేపధ్యంలో దీనికంతటికీ ఎక్కువ సమయం పడుతుంది కనుక తుది జాబితాను రూపొందించటానికి కేటాయించిన సమయం సరిపోదని, గడువును మరింత పొడిగించవలసిందిగా అభ్యర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది.