
260views
దేశ రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న భారత్.. హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ‘ఎయిర్‌బస్ ఎస్‌ఈ’ నుంచి రూ.2,900 కోట్లతో డజనుకుపై పైగా నిఘా విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో తొమ్మిది భారత నౌకాదళానికి, ఆరు కోస్ట్‌గార్డ్‌కు వెళ్లనున్నాయి. వీటిని వీలైనంత త్వరగా మోహరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నాలుగు సి-295 విమానాలను ఎయిర్‌బస్ తయారుచేస్తుంది. మిగిలినవి భారత్‌లో తయారుకానున్నాయి. అరేబియా సముద్రంలో డజన్ల కొద్దీ యుద్ధనౌకలు, మానవరహిత విమానాలను భారత్ మోహరించింది. తాజాగా నిఘా విమానాలతో హిందూ మహాసముద్రంలోనూ సామర్థ్యాన్ని మరింత బలపరుచుకోనుంది.





