
అయోధ్యనగరంలో ఈనెల 22వ తేదీన శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో వేలాది మొక్కలతో అక్కడ నర్సరీ రైతులు మద్దతు తెలియజేశారు. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 50 వేల మొక్కలతో 15 రోజులు పాటు కష్టపడి అక్కడ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఆ జిల్లాలో చేసిన కార్యక్రమం ఆధ్యాంతం రమణీయంగా ఆధ్యాత్మికంగా పలువురిని ఆకట్టుకుంటుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీ అంటే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు ఈనెల 22వ తేదీన అయోధ్య నగరంలో శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దాదాపు 50 వేల మొక్కలతో జైశ్రీరామ్ జై అయోధ్య అనే పేర్లతో చుట్టూ చక్కని స్వామివారి ఆలయ నమూనా సైతం ఏర్పాటు చేశారు. సుదీర్ఘ ప్రదేశంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ మొక్కల సీతారాముల ప్రతిమలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు 15 రోజులు పాటు 20 మంది కూలీలు నియమ నిష్ఠలతో గతంలో ఎన్నడూ లేని విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అనేక రకాల మొక్కలతో ఈ అందమైన వర్ణాన్ని తీర్చిదిద్దడం జరిగిందని కడియం నర్సరీ నిర్వాహకులు పేర్కొన్నారు





