News

బెంగాల్ హింసపై కేంద్ర హోం శాఖ సీరియస్.

890views

సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి బెంగాల్లో చెలరేగుతున్న హింసపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. బెంగాల్లో బర్ద్వాన్, ముర్షిదాబాద్ లలోని మదరసాలలో బాలలకు, యువకులకు తీవ్రవాద శిక్షణ ఇస్తున్నారని. ఈ మదరసాలలో తయారైన వారిని బంగ్లాదేశ్ కు చెందిన నిషేదిత ఉగ్ర వాద సంస్థ జమాతే ఉల్ ముజాహిద్దిన్ సంస్థ తన కార్యకలాపాలకు ఉపయోగించుకుంటూ ఉన్నదనే స్పష్టమైన సమాచారం తమ దగ్గర ఉన్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖ సమాచారాన్ని ఇస్తూ ఉన్నదని, తగిన చర్యలు తీసుకోవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నదని కిషన్ రెడ్డి తెలిపారు. బెంగాల్లో జరుగుతున్న హింస, మత కల్లోలాలపై కేంద్ర హోం శాఖ సీరియస్ గా దృష్టి సారించిందని కూడా కిషన్ రెడ్డి తెలిపారు.