News

ధర్మం, సంస్కృతిపై అవగాహన అవసరం

4views

సత్సంగాల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన, బాధ్యతలు మరింత పెరుగుతాయని విశ్వహిందూ పరిషత్‌ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డి.డి.నాయుడు అన్నారు.

అనకాపల్లి తుమ్మపాలలోని వేణుగోపాలస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో సత్సంగ వర్గ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ డి.డి.నాయుడు మాట్లాడుతూ.. వీహెచ్‌పీ ఆవిర్భావ లక్ష్యాలు, హిందూ ధర్మ పరిరక్షణలో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. హిందూ సమాజ సంఘటన అవసరాన్ని కూడా ప్రస్తావించారు.

కుటుంబ వ్యవస్థకు సత్సంగాలు బలం
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో సత్సంగాలకు కీలక పాత్ర ఉందని డి.డి.నాయుడు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావనలు, సనాతన విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యదర్శి పీలా హేమ జగదీష్‌ నాయుడు, జిల్లా కోశాధికారి గోకవరపు రమేష్‌, నగర అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, సత్సంగ నిర్వాహకులు ఐ.వి.కూర్మనాథం, దేవస్థాన కమిటీ సభ్యులు మార్టూరు అజయ్‌, నడిపల్లి బోసుబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.