News

నంద్యాలలో అక్రమంగా నిర్మించిన చర్చిని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు.

775views

అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ చర్చిని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంఘటన నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో చోటు చేసుకుంది.

నంద్యాల పట్టణంలో గతంలో పని చేసిన తహసీల్దార్ దగ్గర నందమూరి నగర్లో ఒక తాత్కాలిక భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న కొంతమంది క్రైస్తవ మత పెద్దలు దానిని కొనసాగిస్తూ ఆ స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. దీనిని గమనించిన స్థానికులు కొందరు సదరు నిర్మాణానికి ఎలాంటి అనుమతి లేదని, అక్రమంగా అక్కడ చర్చి నిర్మాణం చేపడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించారు.

దానితో వెంటనే స్పందించిన మున్సిపల్ కమీషనర్ భవానీ ప్రసాద్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమంగా నిర్మించిన చర్చిని కూల్చివేశారు. ఎవరైనా సరే ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా క్షమించబోమని, ఎంతటి వారైనా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ తెలిపారు.