
* హిందూ సంస్థల ఐక్యతను బలోపేతం చేద్దాం
* సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పికొడదాం
* ముగిసిన ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలు
* 2026 లో ముంబై లో నిర్వహించాలని నిర్ణయం
* 61 దేశాల నుంచి 2100 మంది ప్రతినిధులు హాజరు
సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పి కొడదా మని, హిందూ సంస్థల మధ్య ఐక్యతను బలోపేతం చేద్దామని ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్సీ) నిర్ణయించింది. విదేశాల్లో ఎన్నికైన హిందూ ప్రజా ప్రతి నిధులకు మద్దతుగా నిలుద్దామని, వారికి వ్యతిరేకంగా జరిగే రాజకీయ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి వారిని సంఘటితం చేసి పరస్పరం మాట్లాడుకునేలా చర్యలు
తీసుకుందామని తీర్మానించింది.
మూడు రోజులపాటు థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగిన డబ్ల్యూ హెచ్సీ సమావేశాలు ముగిశాయి. సమావేశాలను శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగ వత్ ప్రారంభించగా.. ఆదివారం ఆధ్యాత్మిక గురువు మాత అమృతానందమయి దేవి ముగించారు. సమావేశాలకు 61 దేశాల నుంచి దాదాపు 2100 మంది ప్రతి నిధులు హాజరయ్యారు. తదుపరి సమావేశాలను 2026లో ముంబయిలో నిర్వహించాలని ఈ సంద ర్భంగా నిర్ణయించారు.
హిందూ సమాజం ప్రస్తుతం దురదృష్టవశాత్తూ ఎవరు తాకినా ముక్కలుగా విరిగి పోయే సున్నితమైన లడ్డూను తలపిస్తోంది. హిందువులు విచ్ఛిన్నం చేయడానికి కష్టంగా ఉండే గట్టి లడ్డూ లాగా ఉండాలి. అప్పుడే అసాంఘిక శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోగలం’ అనే సందేశంతో కూడిన ఓ లడ్డూ బాక్సును ప్రతి ప్రతినిధికీ సమావే శాల్లో అందించారు. ‘హిందువులకు చేరువయ్యే ప్రక్రియ కరోనా తర్వాత నెమ్మదించింది. మేము ఇప్పుడా ప్రక్రి యను పునరుద్ధరిస్తున్నాం’ అని ప్రపంచ హిందూ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద తెలి పారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా క్రిస్టియన్ సంస్థల ఆధీనంలో ఉన్న హిందూ ఆలయాల స్థలాలపైనే ఉందని, వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.





