News

అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట ; మోగించినపుడు ఓంకార శబ్దం

326views

అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేం దుకు సిద్ధమైంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం. ఇందు కోసం రూ.25 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జింక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని చెప్పారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారని.. సుమారు మూడు నెలలు పట్టిందని నిర్వాహకులు వెల్లడించారు.