News

సనాతన ధర్మంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

310views

సనాతన ధర్మంపై కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి.

సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బీజేపీ లాంటి రైట్ వింగ్ పార్టీలు సంస్థలే కాకుండా డీఎంకేతో మితృత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు కూడా స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టాయి. అయినప్పటికీ ఆయన ఎంతమాత్రం తగ్గలేదు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని రద్దు చేయాలంటూ మరింత హీట్ పెంచారు.

కొద్ది రోజుల చర్చ అనంతరం.. ఇది కాస్త చల్లబడింది. ఇప్పుడు తాజాగా ఈ కాంట్రవర్సీని మరోసారి చర్చలోకి తెచ్చారు ఉదయనిధి. తాను సనాతన ధర్మాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. ”నేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడిన ప్రతి మాట సత్యం. దీన్ని నేను చట్టపరంగా కూడా ఎదుర్కొంటాను. నా వ్యాఖ్యల్లో ఒక మాటను కూడా మార్చే ప్రసక్తే లేదు. నేను నా భావజాలాన్ని చెప్పాను ” అని అన్నారు.