News

12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

283views

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 12న దీపావళి ఆస్థానం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరగనుంది. సాయంత్రం అయిదు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. దీపావళి ఆస్థానం సందర్భంగా ఈ నెల 12న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను తితిదే రద్దుచేసింది. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.