News

నేటి నుంచి భారత్‌, నేపాల్‌ సైనిక సమావేశాలు

297views

నేపాల్‌, భారత్‌ సైనిక దళాల మధ్య ఏటా మూడు రోజుల పాటు జరిగే ద్వైపాక్షిక సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. భారత బృందానికి సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌ రష్మీ శుక్లా నేతృత్వం వహించనుండగా.. నేపాల్‌ తరఫున సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రాజూ ఆర్యాల్‌ పాల్గొంటారు. దిల్లీలో జరిగే ఈ సమావేశాల్లో ఇరు దేశాల మధ్య రహస్య సమాచార మార్పిడి సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాల కట్టడి తదితర అంశాలు చర్చకు రానున్నాయని ఓ అధికారి వెల్లడించారు.