
405views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఆలయంలో అక్షింతల పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు. ఈ అక్షింతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఇందుకోసం 100 క్వింటాళ్ల బియ్యం, పసుపు, నెయ్యిని ఉపయోగించినట్లు ట్రస్ట్ తెలిపింది. విశ్వ హిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు జనవరి 1 నుంచి జనవరి 15 మధ్య కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి ఈ అక్షింతలను పంపిణీ చేయనున్నారు.





