
విజయవాడ కనకదుర్గ గుడి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. గత మూడు రోజులు హుండీలలో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా 8 కోట్ల 73 లక్షల ఆదాయం నగదు రూపంలో వచ్చింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి ఎస్ పిఎఫ్ వన్ టౌన్ పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆన్ లైన్ నందు ఈ- హుండీ ద్వారా రూ.1 కోటి 97లక్ష 207లు విరాళముగా భక్తులు చెల్లించుకున్నారు.
దసరా నవరాత్రులకు 12 లక్షల, 2వేల 678 మంది భక్తులు వచ్చినట్టుగా సాంకేతికంగా గుర్తించామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు పేర్కొన్నారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు దసరాకు వచ్చి ఉండచ్చన్నారు. లడ్డు ప్రసాదాలు 15,05,638 అమ్మకం జరిగాయని తెలిపారు. రూ.3.75 కోట్లు లడ్డు ప్రసాదం ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 14 నవంబరు నుంచీ 12 డిసెంబరు వరకూ కార్తీక మాసంలో భవానీలు వస్తారని పేర్కొన్నారు. కార్తీక శుద్ధ విదియ నాడు గాజుల అలంకారం ఉంటుందని తెలిపారు.




