
279views
తిరుపతి జిల్లాలోని తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమల్లోకి తీసుకొచ్చింది టిటిడి. తిరుమల తరహాలో తిరుచానూరులోనూ ప్రత్యేక దర్శన టిక్కెట్లను భక్తులకు మంజూరు చేయమన్నారు. ప్రత్యేక దర్శనం టికెట్టును 200 రూపాయలుగా టిటిడి నిర్దేశించింది. ఆన్ లైన్ లోను టిక్కెట్టును పొంది త్వరితగతిన అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. గంటకు 200 చొప్పున రోజుకు 2 వేల టిక్కెట్ల ను ఆన్ లైన్ లో టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. 15 రోజుల ముందే కూడా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.





