News

జనవరి 26 తరవాత భక్తులకు రామ్ లల్లా దర్శనం : శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు

191views

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరు కావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేసింది. వారందరికీ తాము తగిన ఏర్పాట్లు చేసే అవకాశం లేనందునే ఇలా కోరుతున్నామని వివరించింది. స్థానిక అధికార యంత్రాంగం కూడా ప్రొటోకాల్‌ పాటించే పరిస్థితిలేదని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. జనవరి 26 తరవాత దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులను అయోధ్యకు ఆహ్వానిస్తున్నామన్నారు. వారంతా రామ్‌లాలాకు పూజలు చేసుకోవాలని కోరుతున్నామన్నారు. శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను దక్షిణ భారత యాత్రికులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులను వివిధ సమయాల్లో ఆహ్వానించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. అలా వచ్చే వారికి వసతి, ఆహార సదుపాయాల ఏర్పాట్లను చేస్తామన్నారు.