News

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సామాజిక సమరసత సమ్మేళనం

239views

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సామాజిక సమరసత సమ్మేళనం ఆదివారం నెల్లూరుకు సమీపంలోని గొలగమూడు శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రారంభంలో ముందుగా శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సహ ప్రచారక్ భరత్,సమరసత వేదిక అఖిల భారత నాయకులు శ్యాంప్రసాద్, రాష్ట్ర సంయోజక్ కోడూరి సత్యం, పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్వామీజీ మాట్లాడారు. సమావేశానికి మూడు జిల్లాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.