
320views
చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై అధికార నందిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. . స్వామివారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉత్సవానికి కాణిపాకానికి చెందిన వళ్ళువర్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.ఉభయదేవేరులతో కలిసి స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి అధికార నంది వాహనంపై అధిష్ఠింపజేసి పురవీధుల్లో ఊరేగించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్య పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు .





