News

మంత్రాలయంలో భీమన కట్టె పీఠాధిపతికి సన్మానం

276views

రాఘవేంద్ర స్వామి మఠంలో కర్ణాటక రాష్ట్రంలోని భీమన కట్టె పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థుల చాతుర్మాస్య దీక్ష పూర్తయిన సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. మఠానికి చేరుకున్న ఆయనకు మఠం అధికారులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. మూల బృందావనం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠం ప్రాకారం ఊంజల మంటపంలో మూలరామ చిత్రపటాన్ని వెండి ఊయలపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమన కట్టె పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థులుకు చాతుర్మాస్య కనికె టోకెన్‌ కానుక రూపంలో వెండి పళ్లెంలో రూ.5 లక్షలను అందజేసి శేష వస్త్రంతో సన్మానించారు