NewsSeva

పిల్లల ఆరోగ్యం పై జయభారత్ అవగాహనా శిబిరం.

964views

నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం కసుమూరు లో చిన్న పిల్లల వైద్య శిబిరం జరిగినది. జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ వైద్య శిబిరంలో పిల్లలకు వైద్యసేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో 52 మంది పిల్లలకు వైద్య సేవలు అందించడం జరిగింది. నిర్వాహకులు అందరికీ ఉచితంగా మందులు అందజేశారు.

వేసవి కాలంలో పిల్లలసంరక్షణకు తీసుకోవలసిన చర్యలను డాక్టర్ గారు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. వేసవి కాలంలో పిల్లలను ఎండలో తిప్పకుండా చూసుకోవాలని అలా తిరిగినట్లయితే వారికి వడదెబ్బ సోకి అనారోగ్యానికి గురి అవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోస్తా సేవాసమితి బాలకార్మిక పాఠశాల విద్యార్థులు కూడా వైద్యసేవలు పొందారు. ఈ కార్యక్రమంలో జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురు ప్రసాద్, పి ఆర్ ఓ కృష్ణారెడ్డి మరియు గ్రామంలోని యువత పాల్గొన్నారు.