News

శ్రీ సీతా రాముల కళ్యాణం

979views

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీ రామాపురం గిరిజన కాలనీలో శ్రీ రాముల వారి కళ్యాణం నిర్వహించబడినది. ఈ గిరిజన కాలనీలో ప్రతి సంవత్సరం శ్రీరామ ఉభయాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగానే జయభారత్ హాస్పిటల్, విశ్వహిందూ పరిషత్ ల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సీతా రాముల కళ్యాణం నిర్వహించారు.ఈ కాలనీలో మొట్టమొదటిసారిగా రాముల వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది.

గ్రామంలో కొందరు కళ్యాణం లో పాల్గొని శ్రద్దా భక్తులతో కళ్యాణాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు దత్తాత్రేయ మఠం పీఠాధిపతి శ్రీ దయానంద స్వామి, లలితా మహేశ్వర పీఠాధిపతి మహేశ్వర స్వామి పాల్గొన్నారు. ఈ కళ్యాణాన్ని నాగఫణి శర్మ గారు నిర్వహించారు. రామాయణంలోని ఘట్టాలను శ్రీ మహేశ్వర స్వామి, శ్రీ దయానంద స్వామి గ్రామస్తులకు అర్థం అయ్యే విధంగా సరళమైన భాషలో వివరించారు. ఈ కళ్యాణం లో మహిళలు, పెద్దలు, పిల్లలు సుమారు 350 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.