News

అశ్వవాహనంపై దర్శనమిచ్చిన చౌడేశ్వరి

378views

అనంతపూర్‌ జిల్లా అమడగూరు స్థానిక చౌడేశ్వరీ దేవి జ్యోతి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవకర్తలుగా రెడ్డివారిపల్లికి చెందిన అశ్వత్థమ్మ, పీఎల్‌ఎన రెడ్డి, పీ శ్రీరామిరెడ్డి వ్యవహరించారు. అమ్మవారి పల్లకిని ప్రత్యేకపుష్పాలతో అలంకరించి ఆలయంనుంచి మంగళవాయిద్యాల మధ్య ఉట్టి మండపం వరకు ఊరేంగించారు. అక్కడ ప్రత్యేక పూజలనంతరం తిరిగి ఆలయానికి చేర్చారు. భక్తులకు పలువురు దాతలు అన్నదానం చేశారు. తీర్థప్రసాదాలను అందించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర వడ్డెర సాధికర సమితి కన్వీనర్‌ వడ్డె వెంకట్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ చేపట్టినయువగళం పాదయాత్ర విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు.