News

చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

177views

మార్కా పురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి రాజ్యలక్ష్యీ అమ్మ వార్ల మూలవిరాట్‌లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవీ, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరిం చారు. నగరోత్సవం అనంతరం స్వామి భేరి మండపంలో వేయించేశారు. అనంతరం సోమ యాజుల మల్లిఖార్జునశర్మ శాస్త్రోక్తంగా యజ్ఞం, నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజాన్ని ఆరోహణ చేశారు. ఉభయదాతలుగా మంచి కంటి సుబ్రహ్మణ్యం, చాటకొండ చంద్రశేఖర్‌, నాగరాజు పాల్గొన్నారు. ఈవో జి.శ్రీనివాసరెడ్డి, ఆలయ అధ్యక్షుడు పి.కేశవరావు పాల్గొన్నారు.

నేడు కల్యాణం….
బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవీ భూదేవి సమేత చెన్నకేశవస్వామి కళ్యాణం శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించనున్నారు. సాయం త్రం స్వామికి చంద్రవాహన సేవ జరగనుంది.

నెమలిగుండ్లలో…
రాచర్ల మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామసమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురు వారం బ్రహ్మోత్సవాలు ప్రారంభంగా 3 రోజుల పాటు జరుగనున్నాయి. తొలిరోజు అంకురార్పణ, ధ్వజారోహణం, శేషవాహనం, హనుమంత వాహనం లాంటి కార్యక్రమాలు వేదపండితుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో ఇరుముళ్లు కట్టుకున్న భక్తులు పాల్గొన్నారు. వాసవిక్లబ్‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. గిద్దలూరు సీఐ ఎం.డి.ఫిరోజ్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం స్వామి వారి కల్యాణం జరుగనున్న దృష్ట్యా భక్తులు కూర్చు నేందుకు షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించినట్లు ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి తెలిపారు. మూడు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో అధ్యక్షుడు వక్కలగడ్డ మల్లికార్జున్‌, శ్రీకృష్ణదేవరాయ బలిజ సత్రంలో అధ్యక్షులు యామా రంగయ్య, కార్యనిర్వహణాధికారి గోపాల్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పుట్టా బాలకృష్ణ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు.