News

వైభవంగా రామతీర్థం తిరునాళ్ల

216views

చీమకుర్తి రామతీర్థం తిరునాళ్ల మహోత్సవం బుధవారం అంగరం గవైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చా రు. వివిధ రాజకీయపార్టీల వారు 11 విద్యుత్‌ ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ, టీవీ కళాకారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయం విదుద్దీపాలంకరణలతో ఆలంకరించారు. రామతీర్థం తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా బుధవారం రామతీర్థం నిధిలో వేం చేసి ఉన్న మహామాన్విత గంగమ్మ తల్లికి విశేషపూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని వెండిచీర, ఆభ రణాలతో అలంకరించారు. చుట్టుప క్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తమ మొక్కుబడులను పొ ంగళ్లను చెల్లించారు.