News

కన్నుల పండవగా తిరుకల్యాణోత్సవం

390views

అనంతపురం జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో రాములవారి తిరుకల్యాణోత్సవాన్ని కన్నుల పండవగా నిర్వహించారు. ఉదయం సీతారాములకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేదపండితుల మంత్రో చ్ఛారణల నడుమ కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన రథంలో చంద్రప్రభవాహనంపై స్వామివార్లను ఆశీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. నగరోత్సవానికి ముందు గురుగుంట్లకు చెందిన భజనమండలివారు రామకీర్తనలు ఆలపించారు. రాత్రికి స్వామివార్లకు దశహారతులు సమర్పించారు.